7 July, 2026 | 7:04 PM

జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి

07-07-2026 06:29 PM

మఠంపల్లి(విజయక్రాంతి): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 10 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం మఠంపల్లి లో విలేకరుల సమావేశంలో పిడిఎఫ్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చందర్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను విరమించుకుని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు గౌతం,శ్రీను, మహేష్,మధు,చంటి, ఉమేష్,గోపి తదితరులు పాల్గొన్నారు.