14-01-2026 12:06:23 AM
మునిపల్లి,(విజయక్రాంతి): రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అరైవ్.. అలైవ్ ప్రోగ్రాంపై మంగళవారం నాడు మండలంలోని బుదేరా చౌరస్తాలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ నాయక్ మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు, ప్రయాణికులను తమతమ గమ్యస్థానాలకు చేరవేసే దిశగా ఈ అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని పోలీసు శాఖ రూపొందించిందన్నారు. అందుకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం, మైనర్ డ్రైవింగ్ చేయరాదనే విషయాలు ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
అలాగే ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలులో ఉంటాయని, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రోడ్డు ఇరువైపులా వాహనాలు నిలుపరాదన్నారు. ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వలన ముందు వెళ్తున్న వాహనదారులకు ఇబ్బందులై ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించి, తమ ప్రయాణాన్ని సురక్షితంగా విజయవంతంగా ముగించాలని ఆయన కోరారు.