14-01-2026 12:07:15 AM
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు
టీపీసీసీ అధికార ప్రతినిధి షేక్షావలి
అయిజ, జనవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అయిజను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని అయిజ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని టీపిసిసి అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి అన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేత సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం అయిజ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయిజ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు.గత పదేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ అయిజను సర్వ నాశనం చేసిందని అభివృద్ధిలో పూర్తిస్థాయిలో వెనుకబడిందని అన్నారు.
పదేండ్ల పాలనలో అభివృద్ధికి కనీసం 5 కోట్లు మంజూరి చేసిన దాఖలాలు లేవని ఏద్దేవా చేశారు. సంపత్ కుమారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిఆర్‌ఎస్ తో కొట్లాడి తెచ్చిన నిదులే కానీ ఇంతవరకు స్వంత నిధులతో చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రాయలసీమ బంగ్లాకు పరిమితమై నియోజకవర్గంను బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. సంపత్ ఓడిన నిష్పక్షపాతంగా అయిజను అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడని కాబట్టి,ఈసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పోతుల జనార్ధన్ రెడ్డి, సంకాపురం రాముడు,మద్దిలేటి, దొడ్డప్ప, ఉత్తనూరు జయన్న, సులోచన,మైనర్ బాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.