calender_icon.png 14 January, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవాడికి ప్రాణదాత

14-01-2026 12:05:53 AM

సావిత్రి వైద్యం కోసం రూ. 10 లక్షల ఎల్‌ఓసి మంజూరు చేయించిన 

ఎమ్మెల్యే మేఘారెడ్డి

రేవల్లి జనవరి 13: ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడంలో వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేద మహిళకు ఏకంగా రూ. 10 లక్షల విలువైన ఎల్.ఓ.సి పత్రాలను మంజూరు చేయించి ఆమె ప్రాణాలను కాపాడేందుకు భరోసానిచ్చారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. రేవల్లి మండలం, తల్పునూర్ గ్రామానికి చెందిన మద్దుల సావిత్రి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం అందించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో, బాధితురాలి భర్త, మాజీ ఎంపీటీసీ ఎక్కె వెంకటేష్ కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని కలిసి తమ ఆవేదనను వివరించారు.

తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే  ప్రభుత్వ పరంగా ఆమెకు అత్యుత్తమ చికిత్స అందేలా చొరవ తీసుకున్నారు. మొదటి విడతలో రూ. 5 లక్షలు, రెండో విడతలో రూ. 5లక్షల గల ఎల్‌ఓసిలో మొత్తం రూ. 10 లక్షల రూపాయలు గల ఎల్‌ఓసిని. హైదరాబాద్ మాదాపూర్లోని తన కార్యాలయంలో పత్రాలను బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా సావిత్రి భర్త చంద్రశేఖర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మా పరిస్థితి చూసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా భార్యను ఆదుకోవడానికి రూ. 10 లక్షల భారీ సాయం అందించిన ఎమ్మెల్యేకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.