13 August, 2026 | 8:52 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్‌లో సైబర్ నేరాలపై అవగాహన

13-08-2026 07:43 PM

సైబర్ నేరలపై విద్యార్థులకు అవగాహన

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం  సైబర్ నేరలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. కళాశాల, సైబర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్ సిబ్బంది అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించడంతో పాటు, విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా స్కిట్‌ను ప్రదర్శించారు.

కార్యక్రమంలో సునీల్ , సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్, సీఐ, నిర్మల్ టౌన్, శ్రీమతి శ్రావణి, ఎస్‌ఐ, నిర్మల్ టౌన్, ముత్యం ఎస్‌ఐ, నిర్మల్ టౌన్ పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి. సైబర్ మోసాలకు ప్రజలు ఎలా గురవుతున్నారు, వాటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి, సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి అనే అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.