07-02-2026 12:00:00 AM
ముషీరాబాద్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్‌రెడ్డి
ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కుష్టి వ్యాధి నిర్మూలనకు పక్షం రోజులపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ముషీరాబాద్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కుష్టి వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ కుష్టి వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందన్నారు.
శరీరంపై మొద్దు బారిన మచ్చలు వస్తే వెంటనే సంబంధిత వైద్యాధికారులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయిం చుకోవాలని ఆయన కోరారు. (ఎన్‌ఎల్‌ఈపి) కింద 2017 జనవరి 30న కుష్ఠు వ్యా ధి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ’స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన ప్రచా ర కార్యక్రమం’ (స్లాక్) ప్రారంభించబడిందన్నారు. డిపిఎమ్‌ఓ ప్రసా ద్, పి హెచ్‌ఎన్ విజయ, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.