16 May, 2026 | 1:51 PM

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

16-05-2026 01:20 PM

తంగళ్ళపల్లి,మే 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా డీఎంహెచ్‌ఓ రజిత మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణకు పరిశుభ్రమైన పరిసరాలు ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, పద్మనగర్ సర్పంచ్ మోర నిర్మల, ఆశా వర్కర్లు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.