calender_icon.png 14 January, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ క్రీడలపై అవగాహన ర్యాలీ

14-01-2026 12:00:49 AM

వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ క్రీడలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జ్యోత్స్న ఆధ్వర్యంలో వాంకిడి మండల కేంద్రంలో యువకులతో, అధికారులతో కలిసి ప్రచా ర ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా  సీఎం కప్ క్రీడల ప్రాముఖ్యత, పోటీల్లో పాల్గొనే విధానం, నమోదు ప్రక్రియ గురించి ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న యువకులకు ఎంపీడీవో వివరించారు. ఆమె మాట్లాడుతూ, క్రీడలు యువతలో ఆరోగ్యం, ఉత్సా హాన్ని పెంపొందిస్తాయని వివరించారు.

సీఎం కప్ క్రీడల ద్వారా మండల యువకులు రాష్ట్ర స్థాయిలో పోటీపడి పతకాలు సాధించే అవకాశం ఉందన్నారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి, మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ ల నుంచి యువకులు పాల్గొ నేలా అధికారులు గ్రామీణ యువతను ప్రోత్సహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వాంకిడి సర్పంచ్ చునార్కర్ సతీష్, ఎంపీఓ ఖాజా అజిజు ద్దీన్, కార్యాలయ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శు లు, స్థానిక యువకులు తదిత రులు పాల్గొన్నారు.