22 May, 2026 | 10:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

కేంద్రం ప్రభుత్వం వాటా లేనిది ఏ పథకం లేదు

14-01-2026 12:00 AM

విలేకరుల సమావేశంలోఎంపీ డీకే అరుణ 

మహబూబ్ నగర్, జనవరి 13 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం వాటా లేనిది రాష్ట్రంలో ఏ పథకం అమలు కావడం లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జీ రామ్ జీ పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, వికసిత్ భారత్ లక్ష్యంతో దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారన్నారు. వికసిత్ భారత్ కావాలంటే.. వికాసిత్ గ్రామం కావాలని జీ రామ్ జీ పథకం తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన తో పాటు వంద రోజుల నుంచి 125 రోజులకు పని పెంచడం జరిగిందనన్నారు.

ఇప్పటికి అనేక గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు, స్కూల్ కి అదనపు తరగతులు లేవన్నారు. గతంలో వేతనాల ఎప్పుడూ వస్తాయో తెలియని పరిస్తితి ఉండేదని, ప్రస్తుతం 15 రోజుల్లో డిజిటల్ వేతనాలు చెల్లించాలన్నారు. యూపీఏ హయాంలో MNREGA కింద 2లక్షల కోట్ల పై చిలుకు ఖర్చు చేస్తే.. మోదీ ప్రభుత్వం రూ 8 లక్షల 53వేల కోట్లు ఖర్చు చేసిజె తెలంగాణకు 3వందల కోట్లు పైగా అదనపు లబ్ధి చేకూరిందన్నారు.

ఏ పార్టీ నుంచి ఎంపీగా గెలిసిన వారికి కేంద్రం 5 కోట్ల రూపాయల ఎంపీ లాండ్స్ తారతమ్యభవం లేకుండా ఇస్తుంది. పథకం పేరు చూసి కాంగ్రెస్ ఓర్వలేకోతుందన్నారు. జీ రామ్ జీ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి తగ్గడంలేదు.. రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు అదనంగా జోడిస్తే.. మరింత అభివృద్ది జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పద్మజారెడ్డి, మెట్టుకడి శ్రీనివాస్, కిరణ్ కుమార్ రెడ్డి, బాలరాజు, వీరబ్రాహ్మచారి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, బుచ్చిరెడ్డి, జయశ్రీ, యాదగిరి, పద్మవేణి, రాజేందర్, కరుణాకర్, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.