10 August, 2026 | 7:33 PM

ప్లాస్టిక్ రద్దుపై అవగాహన ర్యాలీ

10-08-2026 06:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు.  గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకట్‌రెడ్డి కరపత్రాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్‌ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు.