calender_icon.png 14 February, 2026 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకులకు డ్రగ్స్, మల్టిమీడియాపై అవగావాహన సదస్సు

14-02-2026 08:29:33 PM

కోదాడ,(విజయక్రాంతి): వాలెంటెన్స్ డే పురస్కరించుకొని కోదాడ పట్టణ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో యువకులకు డ్రగ్స్, మల్టీ మీడియాపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. యేసయ్య మాట్లాడుతూ... యువకులు చెడు ఆలోచనలు మాని, తమ దృష్టి చదువు మీదను భవిష్యత్తు మీదను మళ్లించుకోవాలని కోరారు. యువకులు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి, ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటిపాక జానకి ఏసయ్య, రెవ ఎనోశారాజ్, పాస్టర్ అబ్రహం పాస్టర్ రాజేష్ పాస్టర్ ప్రభుదాస్ సామ్యూల్ డానియల్ యువకులు పాల్గొన్నారు.