పర్యావరణ చట్టాలపై అవగాహన సదస్సు
06-01-2026 12:00 AM
కరింనగర్ క్రైం, జనవరి 5 (విజయ క్రాంతి): నగరంలోని మంకమ్మతోట ప్రభుత్వ ఉన్నత (ధన్గర్ వాడి) పాఠశాలలో సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ‘నేటిని రక్షించండి - రేపటిని సురక్షితం చేయండి‘ అనే నినాదంతో పర్యావరణ చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్ లు హాజరై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొట్టే ప్రమోద, ఉపాధ్యాయులు యం.ఆనందం, పి.వెంకట్ రెడ్డి, కే. బాలయ్య, బి.జె. జాన్, ఏ. ప్రవీణ్, ఎం. శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.






