06-01-2026 12:00:00 AM
కోదాడ (నడిగూడెం) జనవరి 5: సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులుగా భూత్కూరి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం ఎంపీపీ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో రామాపురం సర్పంచ్ భూత్కూరి వెంకటరెడ్డిని ఏకగ్రీవంగా ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు దున్నా శ్రీనివాస్, గోసుల రాజేష్,దాట్ల నాగేశ్వరరావు, పాటిబండ్ల వెంజటేశ్వర్లు, వేల్పుల సోమయ్య, కంభంపాటి సరిత, అట్టూరి పుష్పావతి, చిర్రా రమ్య, దొడ్డి నరసింహారావు, విమలపంగు సరోజిని, ధారావత్ వరలక్ష్మి, కేశగాని సరితలు పాల్గొన్నారు.