calender_icon.png 10 January, 2026 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా టీఎస్ యూటీఎఫ్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

06-01-2026 12:00:00 AM

నూతనకల్, జనవరి 5: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం టీఎస్ యుటిఎఫ్  2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మండల విద్యాధికారి రాములు నాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

బకాయి ఉన్న డీఏ లను వెంటనే విడుదల చేయాలని,నూతన పీఆర్సీ ని ప్రకటించి ఉపాధ్యాయులకు ఊరటనివ్వాలన్నారు.ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంఎన్‌ఓ శివయ్య, రేణుక, లింగయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అగ్రవాల్ మరియు ఇతర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.