సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపండి: డిఏఓ బాబురావు
22-07-2026 09:42 PM
పలిమేల,(విజయక్రాంతి): ఎలినిఓ ప్రభావంవల్ల వర్షాలు లేని కారణంగా రైతులు సేంద్రియ వ్యవసాయం పై మొగ్గుచూపాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు అన్నారు. బుధవారం పలిమేల మండల కేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలినిఓ ప్రభావం తో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉండటం వలన అరుతడి పంటలు సాగు, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. పలిమేలలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని డిఏఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జవ్వాజి పుష్పలత. మండల వ్యవసాయ అధికారి సంపత్, ఏ ఈ ఓ శరత్, ఆగ్రోస్ రమేష్ రెడ్డి, రైతులు పాల్గోన్నారు.






