22 July, 2026 | 11:07 PM

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి

22-07-2026 10:03 PM

- శానిటరీ ఇన్స్ స్పెక్టర్ అశోక్

హుజూర్ నగర్: హోటల్ నిర్వాహకులు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని హుజూర్ నగర్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్ స్పెక్టర్ మేరిగా అశోక్ తెలిపారు. బుధవారం పట్టణంలోని వివిధ రెస్టారెంట్స్, దాబా హోటల్స్ ను మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.ప్రజలకు  నిల్వలు లేని ఆహారం అందించకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా తయారుచేసి మంచి ఆహారం అందించాలని హోటల్స్ నిర్వాహకులకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారాహి దాబాకు రూ.3 వేలు, దుర్గభవాని దాబాకు రూ.2వేలు, అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ కు రూ.1000/- జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది మమత, రాజశేఖర్, సైదులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దుర్గారావు, రాము, తదితరులు, పాల్గొన్నారు.