22 July, 2026 | 10:25 PM

మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలి

22-07-2026 09:47 PM

* జంతర్ మంతర్ ఘటనపై  నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి

* నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ డిమాండ్

ఉట్నూర్,(విజయక్రాంతి): నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలు నిత్యకృతంగా  మారాయని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతోపాటు  ప్రశ్న పత్రాల లీకేజీకి ముఖ్య కారకుడైన కేంద్ర విద్యా శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని  నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  విలేకరుల సమావేశం  ఏర్పాటుచేసి మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో ని జంతర్ మంతర్ వద్ద  నిరసన తెలిపిన విద్యార్థులపై  లాఠీ చార్జి  చేసినందుకు  దేశ ప్రధాని నరేంద్ర మోడీ బేషర్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గత కొన్ని ఏళ్లలో దేశవ్యాప్తంగా ఒక్ 100 52 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని, తాజాగా నీటి లీకేజీ తో  లక్షలాది మంది విద్యార్థులు  ఆంధ్రుల గురయ్యారని గుర్తు చేశారు. నీట్ పేపర్  లీకేజీ కావడంతో  దేశంలో 21 మంది  విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. నీ ప్రశ్న పత్రాలు లీకేజీపై విద్యార్థులకు సంఘీభావం తెలిపిన  కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతోపాటు  పలువురిని అరెస్టు చేయడం ను తీవ్రంగా ఖండించారు.

దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వానికి  బుద్ధి చెప్పుటకు సిద్ధంగా ఉన్నారని  ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే వారిపై దాడులు  చేయడాన్ని  తీవ్రంగా ఖండించారు. హక్కుల కోసం పోరాడే వారిపై దాడులకు దిగడం దుర్మార్గమని  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉందని, ఇలాంటి దేశంలో శాంతియుతంగా ధర్న, నిరసనలు చేస్తుంటే  ఇస్తారాజ్యంగా పోలీసులను ఉసిగొల్పి వారిపై దాడులు చేయడం హేమమైన చర్య అన్నారు. యువత గొంతులో నొక్కి వేయడమే ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. కాంగ్రెస్ సగర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయనతోపాటు  మండల పార్టీ అధ్యక్షుడు  డి.ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.