22 July, 2026 | 11:02 PM

యాదగిరిగుట్టలో కుక్కల దాడిలో గొర్రెలు మృతి

22-07-2026 09:52 PM

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలోని యాదవ్ నగర్ ప్రాంతంలో కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటనపై  ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య  స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్  గుండ్లపల్లి వాణి భారత్ గౌడ్ బాధిత కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు,  స్థానికులు పాల్గొన్నారు.