calender_icon.png 11 November, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు

11-11-2025 03:39:14 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పోలీస్ స్టేషన్లో మంగళవారం లారీ, ఆటో, డ్రైవర్లు కారు వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ  సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు భద్రత నియమాలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

లైసెన్స్ లేకుండా లేదా మద్యం సేవించే వాహనాలు నడపరాదన్నారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని అతివేగంగా లేదా ఆ జాగ్రత్తగ వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పు తెస్తుందని హెచ్చరించారు. ప్రతి ఒక్క డ్రైవర్లు ఈ క్రింది నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

1). ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ ,ఫిట్నెస్ ,కచ్చితంగా కలిగి ఉండాలి.

2). డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనం నడప రాదు.

3). మైనర్లకు వాహనం ఇచ్చి నడపడం వంటివి చేయకూడదు.

4). వాహనానికి సరైన స్టిక్కరింగ్, లైటింగ్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

5). వాహనం నడిపేటప్పుడు రోడ్డుపై ఉన్న సైన్ బోర్డులను గమనించుకుంటూ వాహనాన్ని నడపాలి.

6). రోడ్డుపై ఎలాంటి హెచ్చరికలు బోర్డులు పెట్టకుండా వాహనాన్ని రోడ్డు పై పార్కింగ్ చేసి ప్రమాదాలకు కారణం కావద్దు అని సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ , మరిపెడ ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు మరియు చిన్నగుడుర్, సీరోల్ ఎస్సై లు ప్రవీణ్ కుమార్, సంతోష్ మరియు మరిపెడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.