ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన
18-04-2026 03:58 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న 42 మంది వివోఏలకు శనివారం ఇంద్ర క్రాంతి భవనంలో ఉద్ధవ్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కలిగించారు. చిన్నచిన్న రుణాల కోసం లబ్ధిదారులు మీసేవ కేంద్రాలకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అయితే వివోఏలు ఉద్దవ్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి చెందే వీలుంటుందని శిక్షణ ఇస్తున్న ఏపీఎం గణేష్ సిసి గంగాధర్లు వివరించారు. వ్యక్తిగత రుణాలు 25 వేల నుండి 50 వేల వరకు ఎస్వీపీ క్రింద అందిస్తున్నారు. చిన్నచిన్న పరిశ్రమలకు రుణం ఇవ్వడం జరిగిందన్నారు.






