17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అడ్డంకులు లేకుండా శ్రీరామ నవమి ఏర్పాట్లు

27-03-2025 12:00 AM

ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన డీసీపీ, అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ డా.బి.బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య, సుల్తానాబాద్ ఏసీపీ కె.శంకర్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి, విద్యుత్ శాఖ, తదితర అధికారులు, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రూట్‌ను పరిశీలించారు. బేగంబజార్ చత్రి, స్వస్తిక్‌మిర్చి, బర్తన్‌బజార్, ఎస్‌ఏబజార్ మసీదు, శంకర్‌శేర్ హోటల్ క్రాస్‌రోడ్, గౌలిగూడ, పుట్లీబౌలి, ఆంధ్రబ్యాంక్, కోఠి, హనుమాన్‌వ్యాంశాల, తదితర ప్రాంతాలను పరిశీలించారు.