17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి

10-06-2025 09:45 PM

పాపన్నపేట: రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించుకొని ఆ దిశగా పంటలను పండించేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు(Agricultural Scientists) పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్(Viksit Krishi Sankalp Abhiyan) కార్యక్రమంలో భాగంగా వరి పరిశోధన సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి పంటకు ముందు మట్టి నమూనా పరీక్షలను నిర్వహించుకొని భూసార పరీక్షల ఫలితాల ద్వారా తగిన మోతాదులో ఎరువులను వాడితే దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకొవడము ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు. ఈ పద్ధతుల వలన వారికి, ఇతర పంటలకు కీటకాల, ఇతర తెగుల నివారణ జరుగుతుందన్నారు. నూతన వంగడాలు, కాండం తొలిచి పురుగు, అగ్గి తెగుల నివారణ వంటివి తమ పంటలలో సోకితే ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనే వాటిపై రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు.

శాస్త్రీయ పద్ధతులను అనుసరించుతూ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేంద్ర కుమార్, డాక్టర్ ఎమ్మెస్ ప్రసాద్, డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ రవికుమార్, ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ అంబికా సోని, ఎడిఏ విజయనిర్మల, ఏవో నాగ మాధురి, ఏఈఓలు అభిలాష్, జనార్దన్, రజితతో పాటు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.