14 May, 2026 | 5:02 PM

ఓటింగ్ శాతం పెంచేలా అవగాహన

23-04-2024 02:07 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారుల సూచనల మేరకు విద్యాసంస్థ లు, రెసిడెన్షియల్ అసోసియేషన్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, టౌన్ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఓటు హక్కు వినియోగం, ఓటర్ల బాధ్యతను తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు. యూసీడీ విభాగం ద్వారా పలువురు మహిళలు సికింద్రాబాద్‌లో చిరు వ్యాపారులకు, యువత తదితరులకు ఓటు చైతన్యంపై అవగాహన కల్పిస్తూ సోమ వారం ర్యాలీలు చేపట్టారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు.