27-10-2025 10:34:32 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): మండల పరిధిలోని సారపాక గాంధీనగర్ లో బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మేడ ప్రసాద్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ మహమ్మారిన పడకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్దాల వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ దేవ్ సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.