calender_icon.png 28 October, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్మికులకు సీనియర్ న్యాయవాది ఆర్థిక సహాయం

27-10-2025 10:37:08 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం గ్రామపంచాయతీ కార్మికులకు సీనియర్ న్యాయవాది ఎం వి రమణారావు వారి కుటుంబ సభ్యులు సోమవారం నాడు ఐటిడిఏ పిఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సమక్షంలో 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పంచాయతీ కార్మికులు విద్యార్థులు పట్టణ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గోదావరి కరకట్ట ప్రాంతంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, పంచాయితీ శ్రీనివాసరావుతో పాటు సీనియర్ న్యాయవాది రమణ రావు తోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారావు పంచాయతీ కార్మికులు పడుతున్న కష్టాన్ని చూసి స్వచ్ఛందంగా వారి కుటుంబ సభ్యులు తరఫున 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. సందర్భంగా పిఓ సబ్ కలెక్టర్ న్యాయవాది రమణారావుని అభినందించారు.