27-10-2025 10:30:39 PM
అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా సిహెచ్. అనూష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మణిధర్, కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మండల ప్రజల సేవలో నిబద్ధతతో పనిచేస్తానని డిప్యూటీ తహసీల్దార్ అనూష తెలిపారు.