24-09-2025 12:09:22 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ (ఆరోగ్య ఉప కేంద్రం)ను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అకస్మిక తనిఖీ చేసారు. తనిఖీలో ఈ కేంద్రంలో అందుతున్న ఆరోగ్య సేవల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రంలో వసతులు మెరుగు పర్చాలని సూచించారు.
నీటి సరఫరా, వసతి కల్పించడానికి తగు ఏర్పాట్లు చేయాలని స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గర్భిణీ పరీక్షల కోసం కావలసిన ఎక్సామినేషన్ మంచాలు, టేబుల్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో అందుబాటులో లేని విషయం గమనించిన కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని అడుగగా అవి సరఫరా లేవని తెలుపగా మొత్తం ఎన్ని ఆయుశ్మాన్ ఆరోగ్య మందిరాలకు మంచాలు, టేబుల్స్ అవసరం అవుతాయో ప్రతిపాదనలు.
తయారు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ ను ఆదేశించారు. తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్ , జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ప్రభు దయా కిరణ్ , వైద్య అధికారి డా. ఆదర్శ్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.