24-09-2025 12:08:07 AM
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన
మణుగూరు, సెప్టెంబర్ 23, ( విజ యక్రాంతి ):సమైక్య పాలనలో సమ్మెలతో నష్టాల్లో నడచిన సింగరేణి సంస్థ కేసీఆర్ పాలనలో స్వర్ణయుగంగా నిలిస్తే మార్పు పేరు తో అధికారంలోకి వచ్చిన నేటి ప్రజా ప్రభుత్వం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సం ఘాలను చేతిలో కీలు బొమ్మలుగా మలుచుకొని లాభాల వాటా పంపిణీ లో కార్మికుల కు తీవ్రమైన అన్యాయం చేసిందని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఆరోపించారు. కాంటాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ లో తీరని అ న్యాయం జరిగిందని నిరసిస్తూ ఏరియా గనులు పార్ట్ మెంట్ లలో మంగళవారం పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాగేల్లి మాట్లా డుతూ.. 2023_24 అర్ధిక సంవత్సరానికి సంస్థ రూ 4,701 కోట్లు లాభాలు ఆర్జి స్తే అందులో సంస్థ అభివృద్ధి పేరిట రూ2,289 కోట్లు పక్కన పెట్టి రూ2,412 కోట్ల లాభాలపై 33 శాతం వాటాగా చెల్లించి కార్మికులను మోసం చేశారని ఆయన ధ్వజ మెత్తారు. ఆ మోసాన్ని ప్రశ్నించవలసిన గెలిచిన సంఘాలు ఆనాడు వత్తాసు పలికినందు కే నేడు మరోసారి మోసానికిపాల్పడి తడి బట్టతో కార్మికుల గొంతు కోశారని విమర్శించారు. లక్షల రూపాయలు కార్మికులకు అం దకుండా నష్టం చేశాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సం ఘం గా ఉన్న సమయంలో ఏనాడు అభివృద్ధి పేరిట సంస్థ సాధించిన లాభాల నుం చి పక్కన పెట్టిన దాఖలాలు లేవని, నికర లాభాల నుంచి నీతిగా, నిజాయితీగా కార్మిక శ్రమకు తగిన పారితోషికం అందించడం జరిగిందన్నారు.
అభివృద్ధి కోసం పక్కన పెట్టిన రూ 2,289 కోట్లు ఏమి చేశారో కార్మికులకు తెలియపరచాలని డిమాండ్ చేశారు. 2024- 25 అర్ధిక సంవత్సరానికి గాను కార్మికులు, అధికారులు సమన్వయంతో శ్రమించిరూ 6,394 కోట్ల గణనీయమైన లాభాలను సాధిస్తే అందులో రూ 4,034 కోట్లు సంస్థ అభివృద్ధి కోసమని పక్కకు పెట్టి రూ 2,360 కోట్లు లాభాలు చూపెట్టి అందులో నుంచి 34 శాతంకార్మికులకు లాభాలను పంచడం కార్మికులను మోసం చేయడమేనన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కు మార్, మునిగేల నాగేశ్వర రావు, సుద్దాల సంపత్ కుమార్ మస్తా న్, సేవా రామాచారి, మురళీ కృష్ణ, జంగం రాజ్ కుమార్ ము కేశ్ కుమార్,కటారి ప్రసాద్, ఇమ్రాన్ నరేష్, వినయ్ కుమార్, శ్రీనివాస్ ప్రవీణ్, పాల్గొన్నారు.