calender_icon.png 9 December, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుభీర్‌లో అయ్యప్ప మహా పడిపూజ

09-12-2025 12:13:24 AM

కుబీర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): కుబీర్ మండల కేంద్రంలోని లోని శ్రీ విఠలేశ్వరాలయంలో  సోమవారం అయ్యప్ప మహ పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించా రు. గ్రామానికి చెందిన అయ్యప్ప గురుస్వామి 18 సంవత్సరాలుగా మాలధారణ చేసిన నారికేళ గురుస్వామిని తోటి గురు స్వాములు,  అయ్యప్ప స్వాములు ఘనంగా సత్కరించారు. ముందుగా గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్యస్వామి కి అభిషేకం, ప్రత్యేక పూజలను రేపల్లె కు చెందిన తోట శివ శంకర్‌రావు గురుస్వామి కన్నుల పండువ గా నిర్వహింపజేశారు. 18 మెట్ల పూజ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజి, ఆయా గ్రామాల అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.