calender_icon.png 6 December, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు

06-12-2025 04:51:01 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, వేములవాడ దేవస్థానం, అగ్రహారం దేవస్థానం, మసీదులు తదితర ప్రదేశాల్లో పోలీసు జగిలాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో కలిసి అనుమానాస్పద వస్తువులు, వాహనాలు, ప్యాకేజీలు, సంచులు లేదా భద్రతకు ముప్పు కలిగించే అంశాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజల సహకారం ఉంటేనే భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా అమలు చేయగలమని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కి లేదా డయల్–100కి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు ప్రజల రక్షణలో కట్టుబడి ఉంటుందని తెలిపారు.