5 April, 2026 | 9:10 PM

బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

05-04-2026 04:45 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాకిరణం డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను కోనరావుపేట మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలాగందుల బిక్షపతి, బీఎస్పీ జిల్లా నాయకుడు దొబ్బల నరేశ్ మాట్లాడుతూ... డా.బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం అచంచల సంకల్పంతో పోరాడిన మహానుభావుడని కొనియాడారు.

దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తిదాయక గాథగా నిలిచిందన్నారు. ఆయన ప్రతిష్ఠించిన న్యాయం, సమానత్వం, సేవ అనే విలువలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయన ఆశయాల సాధనలో సమాన హక్కులు, సామాజిక న్యాయం పరిపుష్టి చెందేలా అందరూ ఐక్యంగా, సంకల్పబద్ధంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దొబ్బల నరేశ్, మల్యాల స్వామి, మల్యాల ఆనందం, ఓద్యారపు శంకర్, కొమ్ము రాజశేఖర్, బొల్లె బాబు, థైదల రాజయ్య, అక్కనపెల్లి సురేష్, బెజగం ముత్యం రాజు, బొల్లె దేవయ్య, గంగారాం, లింగంపల్లి ప్రసాద్, లింగంపల్లి మల్లయ్య, మల్యాల లింబాద్రి, మల్యాల బాబు, మల్యాల రామయ్య, లచ్చయ్య, బొల్లె రాజయ్య తదితరులు పాల్గొన్నారు.