5 April, 2026 | 9:13 PM

బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయం

05-04-2026 04:42 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): బాపు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయమని మండల అధికారులు పలువురు నాయకులు తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మరియు ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయలలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్, మండల ఇన్చార్జ్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్లు గోపాల్పేట్, మాల్తుమ్మెద, ధర్మారెడ్డి గ్రామాలలో సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, పుప్పాల సాయిలు, గులపల్లి లక్ష్మీనారాయణలు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అధికారులు, సర్పంచులు మాట్లాడుతూ... బాబు జగ్జీవన్ రామ్ కుల మతాలకు పరిమితము కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని, తప్పులను గుర్తించేలా కృషిచేసి వారిని మార్చిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఆయన పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. సామాన్య ప్రజల కంటే అధికారంలో పదవులు అధికారులు ఎక్కువగా సేవలు అందించవలసిన అవసరం ఉందని తెలిపారు.

దళిత జాతిలో పుట్టిన ఆణిముత్యం బాబు జగ్జీవన్ రామ్ అని,ఆయన ఆశలను క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు. మహనీయుల సేవలను గుర్తించడంతోపాటు మనలోనూ మార్పు రావాల్సి ఉందన్నారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, భావితరాలకు మహనీయుడు అందించిన సేవలను తెలిసేలా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు.

1908 సంవత్సరంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న ఆయన వివక్షకు గురై రాజీనామా చేశారని,ఇది గుర్తించిన 14 ఏళ్ల బాబు జగ్జీవన్ రామ్ అసమాన తలపై పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఓటమి ఎరుగని నాయకుడిగా 32 సంవత్సరాలు వివిధ శాఖల్లో కేంద్రమంత్రిగా వ్యవహరించారని గుర్తు చేశారు. విద్య అనేది అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.