15 April, 2026 | 3:44 AM

రూ.6 లక్షలకు శిశువు విక్రయం

22-11-2025 07:49 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): నెల నిండని శిశువును 6 లక్షలకు విక్రయించిన సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని ప్రేమించి గర్భవతి అయిన యువతి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో తెలియక అమ్మకానికి పెట్టింది. 6 లక్షల రూపాయలకు శిశువును విక్రయించేందుకు బేరం కుదుర్చుకుని కరీంనగర్లో బిడ్డను విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళగా గుర్తించామని, శిశువును కొన్నవారు గన్నేరువరం మండలవాసులుగా గుర్తించామని టుటౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపారు. పోలీసులు 15 మందిని అరెస్టు చేసి, శిశువును వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.