1 August, 2026 | 1:48 AM

మహేశ్వరంలో దుర్వాసన

01-08-2026 12:07 AM

అధికారుల ముందే చెత్త కుప్పలు

 మహేశ్వరం జూలై 31(విజయక్రాంతి) : ప్రభుత్వ కార్యాలయాల ముంగిట్లోనే చెత్త కుప్పలు పేరుకుపోయి మహేశ్వరంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఎంపీపీ, కోర్టు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లే కేబీ తం డా ప్రధాన రహదారిపైనే వ్యర్థాలను పారేస్తుండటంతో, రోజూ ఆ బాట పట్టే వందలా ది మంది ప్రజలకు దుర్వాసన తప్పడం లేదు. వర్షాకాలం తోడవడంతో మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు ఎ క్కడ విజృంభిస్తాయోనని స్థానికులు భ యాందోళనలో ఉన్నారు. అధికారులు వెం టనే నిద్రమత్తు వదిలి, ఊరికి శాశ్వత డంపిం గ్ యార్డును మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.