నేడు మంత్రుల ప్రాజెక్టుల సందర్శన
01-08-2026 01:45 AM
ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లిని పరిశీలించనున్న ఉత్తమ్, శ్రీధర్‌బాబు
పెద్దపల్లి, జూలై 31 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ, నిర్మల్ జిల్లాలోని కడెం, పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం సందర్శించనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఎస్సారెస్పీకి మంత్రులు చేరుకుని ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1.35 గంటలకు కడెం ప్రాజెక్టుకు చేరుకుని నీటి నిల్వలను, ప్రవాహాన్ని పరిశీలిస్తారు. తర్వాత మధ్యాహ్నం 3.50 గంటలకు ఎల్లంపల్లికి చేరుకొని ప్రాజెక్టునుంచి నీటి విడుదల తదితర అంశాలను పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేయనున్నట్టు సమాచారం.






