12 May, 2026 | 5:48 PM

విద్య వారోత్సవాల్లో భాగంగా కోనరావుపేటలో బడిబాట

12-05-2026 05:15 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): విద్య వారోత్సవాల సందర్భంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ కోనరావుపేట పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ముందస్తుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అజ్మీర మదన్ లాల్ మాట్లాడుతూ గ్రామంలోని పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించబడినట్లు తెలిపారు.

గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నైపుణ్యం కలిగినవారని, ఉన్నత విద్యను అభ్యసించిన వారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న తొమ్మిది రకాల వస్తువులతో కూడిన కిట్, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ్ కుమార్, భాస్కర్, రాము, వెంకటేశం, సంజీవ్, శృతి పాల్గొన్నారు. అలాగే ఉప సర్పంచ్ రేవతి, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.