calender_icon.png 24 December, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం

24-12-2025 10:49:28 AM

LVM-3 M6 రాకెట్ ప్రయెగం విజయవంతం.

కక్ష్యలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం.

తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన ఇస్రో.

షార్ లో శాస్త్రవేత్తల సంబరాలు.

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organisation) బుధవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుండి 'బాహుబలి' రాకెట్‌గా(Bahubali Rocket) పిలువబడే 'ఎల్‌విఎం3-ఎం' రాకెట్‌ను(ISRO LVM3 Launch) విజయవంతంగా ప్రయోగించడం ద్వారా తన వాణిజ్య ప్రయోగ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయవంతమైన మిషన్‌లో, ఇస్రో అధునాతన అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన బ్లూ బర్డ్ బ్లాక్-2ను(BlueBird Block-2 Mission) విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. సుమారు 6,100 కిలోగ్రాముల బరువున్న ఈ ప్రయోగం ఇస్రోకు మరో విశేషమైన ఘనతను తెచ్చిపెట్టింది.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్(ISRO Chairman Dr. V. Narayanan) మాట్లాడుతూ... బాహుబలి ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. శాస్త్రవేత్తలందరికీ ఇస్రో ఛైర్మన్ అభినందనలు తెలిపారు. ఎల్ వీఎం ప్రయోగాల్లో నూరు శాతం విజయాలు సాధించినట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతం చేశామని పేర్కొన్నారు. అమెరికన్ కస్టమర్ కోసం ఈ ప్రయోగం చేపట్టామని నారాయణన్ సూచించారు. భారత భూమి నుంచి పైకెగసిన అతి భారీ రాకెట్ ఇదే అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని ఆయన స్పష్టం చేశారు. 34 దేశాలకు ఇస్రో సేవలందిస్తోందన్నారు. గగన్ యాన్ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోందని తెలిపారు. ఇస్రోపై అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. ఇస్రో చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని ఆయన వివరించారు.