calender_icon.png 24 December, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమజంట అరెస్ట్

24-12-2025 02:40:31 PM

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్(Chikkadpally Police Station) పరిధిలో హెచ్ న్యూ పోలీసులు సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమజంటతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు పెడ్లర్లు, ఒక వినియోగదారుడు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 22 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి, 5 గ్రాముల ఎండీఎంఏ, 5.5 గ్రాముల ఎక్స్ టసీ పిల్స్, 6 ఎల్ఎస్ డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ఇమ్మాన్యుయేల్ కొండాపూర్ లో ప్రైవేట్  ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుస్మిత(Software Engineer) ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఉంటుంది. సుష్మిత ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విలాసాలకు అలవాటుపడిన ప్రేమజంట మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించి క్రిప్టో కరెన్సీలో చెల్లిస్తున్నారు. ప్రధాన సరఫరాదారుడు సాయికుమార్ తో కలిసి వీరు డ్రగ్స్ విక్రయిస్తున్నారు.