calender_icon.png 24 December, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీ నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ

24-12-2025 01:43:22 PM

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి( DGP Shivadhar Reddy) నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోనే డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు ప్యానెల్ లిస్ట్ ఉండాలని హైకోర్టు(Telangana High Court) సూచించింది. ప్యానెల్ లిస్టు పంపి.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 20కి వాయిదా వేసింది.