calender_icon.png 24 December, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ లాంఛనాలతో శుక్లా అంత్యక్రియలు

24-12-2025 02:25:05 PM

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ హిందీ రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత వినోద్ కుమార్ శుక్లా(Vinod Kumar Shukla) అంత్యక్రియలు బుధవారం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. 88 ఏళ్ల ఆ రచయిత అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం బుద్ధ తలాబ్ ప్రాంతంలోని మార్వాడీ శ్మశాన వాటికలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు, సాహితీవేత్తలు, జర్నలిస్టులు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఆయనకు భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. ఆయన కుమారుడు శాశ్వత్ శుక్లా చితికి నిప్పంటించారు. అంతకు ముందు, ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి శైలేంద్ర నగర్‌లో ఉన్న దివంగత సాహితీవేత్త నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వినోద్ కుమార్ శుక్లా అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న ఆయన భౌతికకాయానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి  విష్ణు దేవ్ సాయి మోసారు.