24-12-2025 02:17:36 PM
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో విద్య, సంక్షేమ శాఖలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో రాహుల్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా నిరుపేద విద్యార్థులకు అందాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) అద్భుతమైన మానవ వనరులను సృష్టించాలన్నదే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. అధికారులు శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో చదివే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు చిత్తశుద్ధి, సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించ వద్దని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాలను అమలు చేయడంలో అలసత్వం చూపొద్దని తెలిపారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.