19-01-2026 09:01:13 PM
బీఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబాల ప్రశాంత్
హనుమకొండ,(విజయక్రాంతి): రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజనులు ఏకమై అధికారాన్ని చేపట్టాలని బియస్పి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రశాంత్ పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల ఆదేశానుసారం హనుమకొండ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ... పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని వార్డులకు కౌన్సిలర్లు పోటీ చేస్తారని, బహుజనులు ఐక్యమై బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపి బహుజనుల ఐక్యత చాటాలని అన్నారు. ఈ సమావేశంలో బిఎస్పి జిల్లా ఇన్చార్జి శనిగరపు రాజు, బొట్ల భరత్, గైని రవీందర్, కర్రె రమేష్, విష్ణు, ముత్యాల నరేందర్, దీపక్,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.