13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్‌కు ఘన సన్మానం

19-01-2026 08:57 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల గ్రామ సర్పంచ్‌గా ఇటీవల గెలుపొందిన ప్రజా సేవకులు, ప్రజా నాయకుడు గుడిసె గట్టయ్య యాదవ్‌ ను యాదవ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధి రమేష్ యాదవ్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ కాంటెస్టెడ్ మెంబర్ పొన్నం రవీందర్ యాదవ్ కూడా పాల్గొని గుడిసె గట్టయ్య యాదవ్‌ను అభినందించారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో గుడిసె గట్టయ్య యాదవ్ అంకితభావంతో పనిచేస్తారని, సర్పంచ్‌గా కన్నాల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా  సిద్ధి రమేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ సమాజం నుంచి ప్రజాప్రతినిధులు ఎదగడం గర్వకారణమని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.