calender_icon.png 19 January, 2026 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యం

19-01-2026 09:05:46 PM

- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు

- రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచించాలి. రెండు మున్సిపల్ లో గతంలో కాంగ్రెస్ బీజేపీ లకు అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వం కార్మిక ధార్మికు క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను విస్మరించింది. నేతన్నలకు సుమారు కేటీఆర్ 300 కోట్లు బకాయిలు పెట్టారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే ఇందిరమ్మ చీర సిరిసిల్లలో తయారీ అయ్యయింది. నేతన్నల 30 సంవత్సరాల కల యరన్ డిపో కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది.

సిరిసిల్లలో నేత పరిశ్రమను మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo పట్టాలు ఎక్కించింది.సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ తన చర్మం ఓలచి చెప్పులు కుట్టిస్తాను అంటూ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు.నిన్న భీముని మల్లారెడ్డి కి పోతే ప్రజలు బ్రిడ్జి నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ యువరాజుగ ఉండి కనీసం గ్రామాల్లోబ్రిడ్జి నిర్మాణం చెయ్యలేక పోయారు. మీ బావ రంగనాయక సాగర్ పూర్తి చేసుకున్నాడు కానీ కేటీఆర్ ఎగువ మానేరు ఎందుకు పూర్తి చేయలేదు సమాధానం చెప్పాలి.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటే జిల్లా అభివృద్ధి ఆగదు అని చెప్పాం. ఇప్పటి వరకు సుమారు 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. కేసీఆర్ నా లగ్గం రాజన్న చెంత అయ్యింది ఏటా 100 కోట్లు ఇస్తానని మోసం చేశారు. మూడవ బ్రిడ్జి లేకున్నా ఉన్నట్లు వీడియోల్లో చూపించారు. నేడు మూడవ బ్రిడ్జి నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సిరిసిల్ల పట్టణం వర్షకాలం వస్తే నీట ముంగితుంది. కెటిఆర్ పది ఏళ్లలో చేసిన అభివృద్ధి ఇదేనా. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తాం.

ప్రతి వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది.ప్రజలారా వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. పట్టణ అధ్యక్షులు చొప్పదను ప్రకాష్. మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి.