బహుజన ఉద్యమాలను బలోపేతం చేయాలి
బెజ్జంకి, సెప్టెంబరు 19 : బహుజన ఉద్యమాలను బలోపేతం చేయాలని, బహుజన ఉద్యమం బలోపేతం అయితే తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోలేమని బీఎస్పీ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు, జాతీయ కేంద్రీయ కో ఆర్డినేటర్ సురేష్ ఆర్యలుఅన్నారు.
శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఎస్పీ పార్టీ సమీక్షా సమావేశానికి వెళ్తుండగా సిద్దిపేట జిల్లా బెజ్జెంకి మండల పరిధిలోని రేగులపల్లి స్టేజ్ వద్ద బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ నిషాని రామచంద్రం, మండల నాయకులతో కలిసి శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన ఉద్యమం బలోపేతం అయితే తప్ప రిజర్వేషన్లను కాపాడలేమన్నారు. ఈ కార్యక్రమంలో నిషాని రాజమల్లు, జెరిపోతుల సుమలత, మండల అధ్యక్షులు సవనపెల్లి రాజు, నిషాని సురేష్, వెంకన్న, మంద బాలయ్య, హుస్నాబాద్ అసెంబ్లీ నాయకులు పాల్గొన్నారు.




