calender_icon.png 20 September, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల అభివృద్ధిలో కర్త కర్మ క్రియ ఉపాధ్యాయులే

19-09-2025 10:41:08 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సమాజంలోని విద్యార్థుల అభివృద్ధిలో కర్త, కర్మ ,క్రియ ఉపాధ్యాయులేనని, అంకితభావంతో పని చేసినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రిటైర్డ్ టీచర్స్ భవనములో మండల విద్యాధికారి బోయిన లింగయ్య అధ్యక్షతన సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని, మండల స్థాయిలో 13 మంది ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక పట్ల, వారిని మెమోడం, ప్రశంస పత్రం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తరగతి గదిలో విద్యార్థులకు క్రమశిక్షణ ,విద్య బోధన నేర్పవలసిన బాధ్యత గురువుల పైన ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా మెరుగైన విద్య కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పాఠశాల కళాశాల యూనివర్సిటీలు, బహుళార్థక సాధక ప్రాజెక్టులు, నిరుద్యోగులకు జాబులు, నిర్మాణం చేయడంతోనే నేడు విద్యా వ్యవసాయ రంగాలు ముందు స్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు కష్టపడి, ఉత్తమమైన బోధన, అంకిత భావంతో పనిచేసే రానున్న రోజుల్లో జిల్లా రాష్ట్రస్థాయి పురస్కారాలను పొందాలని కోరారు. అనంతరం పలువు ఉపాధ్యాయులు తమదైన శైలిలో మాట్లాడి, పాటలు పాడి మనలను పొందారు.