calender_icon.png 20 September, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమే..

20-09-2025 12:00:00 AM

జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

జిన్నారం, సెప్టెంబర్ 19 : దేశం కోసం నిరంతరం పని చేసేది బీజేపీ ఒక్కటే అని పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిఅంజిరెడ్డి అన్నారు. ప్రధానీ నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిన్నారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిఅంజిరెడ్డి హాజరయ్యారు.

రక్తదానం చేసిన యువకులందరికి సర్టిఫికెట్లు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. . ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, నాయకులు రాజిరెడ్డి, సుధాకర్, అశోక్ కుమార్, మద్దూరి రాజు, మాణిక్యం, రమణాసింగ్ తదితరులుపాల్గొన్నారు.