చలో చౌటుప్పల్.. బహుజన రాజ్యాధికార యుద్ధభేరి సభను విజయవంతం చేద్దాం
14-03-2026 03:49 PM
గుండాల,(విజయక్రాంతి): చౌటుప్పల్ లో నిర్వహించే బహుజన రాజ్యాధికార యుద్ధ బేరి సభను విజయ వంతం చేయాలనిపిలుపుఇచ్చారు,బీఎస్పీ ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం శ్రీకాంత్. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి15న కాన్సీరామ్ జన్మదినం సందర్భంగా నిర్వహించే బహుజన సభకు తరలి రావాలన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మహనీయుల పేరు మీద బిఎస్పి పార్టీ స్థాపించి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో చివరిగా ఉన్న దళిత బిడ్డను ఉత్తర ప్రదేశ్ లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మహా మేధావి మాన్యవర్ కాన్సీరామ్ జన్మదినాన్ని బహుజనుల పండుగదినంగామార్చుకుందామని తెలిపారు.




