calender_icon.png 3 August, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎఫ్ఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షురాలుగా బాలలక్ష్మి

24-10-2024 04:59:08 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): పీపుల్స్ ఫ్రొమ్ ఆఫ్ ఇండియా నేషనల్ భారత్ సేవక్ సమాజ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బంగారరెడ్డి గారి బాలలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర శాఖ అధ్యక్షులు మామిడి బాల్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాలలక్ష్మి మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర శాఖ అధ్యక్షులు మామిడి బాల్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశంలో మామిడి బాల్ రెడ్డికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన జిల్లాల వారీగా తిరుగుతూ కమిటీలు వేస్తూ పీపుల్ ఫ్రొమ్ ఆఫ్ ఇండియా నేషనల్ భారత్ సేవకు సామాజ్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రచార పర్వాన్ని ముమ్మరంగా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.