రాయుడుపాలెంలో ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారం
ముఖ్య అతిధిగా హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా
వేంసూరు. జూలై 4, (విజయక్రాంతి): వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, బెండాలపాడు వీరన్న–వీరభద్రస్వామి ఆలయాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్మన్లు, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా వడ్లమూడి నరసింహారావు, బెండాలపాడు వీరన్న–వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా కాకాని శ్రీనివాసరావు, ఆయా ఆలయాల ఐదుగురు చొప్పున కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయాల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సోమిరెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాయుడుపాలెం సర్పంచ్, నాయకులు మేడా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు, యువజన నాయకులు పాల్గొన్నారు.






